
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
~~~~~~~~~~~~~~~~~ప్రార్ధన~~~~~~~~~~~~~~`
మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యల కెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
చం.తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా
వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపు నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా
కం.తలచినే గణనాధుని ! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా !
దలచితినే హేరంబుని !దలచిన నావిఘ్నములను తొలగుటకొరకున్
కం.అటుకులు కొబ్బరి పలుకులు ! చిటి బెల్లము నానుబ్రాలు చెఱకు రసంబున్
నిటలాక్షునగ్ర సుతునకు ! పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్