Showing posts with label Annapurna ashtakam. Show all posts
Showing posts with label Annapurna ashtakam. Show all posts

18.12.07

అన్నపూర్ణాష్టకమ్‌


నిత్యాందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేష్వరీ
ప్రాయేలాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 1

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబ మాన విలసద్వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 2

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తప ం ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 3

కైలాసాచల కందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్ధ గోచరకరీ హ్యోంకార బీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 4

దృశ్యాదృశ్య విభూతి వాహన కరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశ మన ం ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభూప్రియా శాంకరీ
కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 6

ఉర్వీ సర్వ జనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీనీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 7

చంద్రార్కా నలకోటికోటి సదృశీ చంద్రాంశు బింబాంధరీ
చంద్రార్కాగ్ని సమానకుంతలధరీ కాశీపురాధీశ్వరీ
మాలా పుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 8

దేవి సర్వ విచిత్ర రత్న రచితా దాక్షాయణి సుందరి
వామా చారుపయోధరా మధురసా సౌభాగ్య మాహేశ్వరీ
భక్తాభీష్ట కరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 9

క్షత్ర త్రాణకరీ మహా భయహరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 10

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే !
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షాందేహి చ పార్వతి !! 11






Get this widget | Track details | eSnips Social DNA