
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా
***
నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవవైరీ
క్షీరాబ్దిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయగ కృష్ణా.
***

శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధరశౌరీ
ద్వారక నిలయ జనార్దన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా
***

పాణితలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయగ పించం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుడ కృష్ణా.
***

చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యాగోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా
***

నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా
***
***

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ వీవే సఖుడౌ
నీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా
***
No comments:
Post a Comment